Shadnagar Fire Accident: షాద్‌నగర్‌లో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేటీఆర్ దిగ్బ్రాంతి

సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Shadnagar Fire Accident: సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

షాద్‌నగర్‌లోని చింతగూడ గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ కంప్రెసర్ పనిచేయకపోవడం వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. పేలుడు జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన కార్మికులు ఒడిశా, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారనిసమాచారం.

ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు సంఘటనా స్థలంలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Also Read: AP Homeminister: భారీ వర్షాలున్నాయి.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి!