కాంగ్రెస్ సర్కార్ (Telangana Govt) తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఆగ్రహపు కట్టలు తెచ్చుకునేలా చేస్తుంది. ఏడాది పాలనలోనే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు , ఆందోళనలు చేస్తూ మాకు వద్దు ఈ ప్రభుత్వం అంటున్నారంటే..ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవాలి. తాజాగా వికారాబాద్ రైతులు ఏకంగా జిల్లా కలెక్టర్, అధికారులపై చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ..ఇక ఎమ్మెల్యేలు , మంత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. ఈ ప్రజల ఆగ్రహం పట్ల హరీష్ రావు (Harish Rao) స్పందించారు. గరీబీ హటావో (Garibi Hatao) అని ఇందిరా గాంధీ (Indira Gandhi) పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో (Kisan Hatao) అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని హరీష్ రావు పేర్కొన్నారు.
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మండిపడ్డారు. ఈరోజు ఆ రాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడిందన్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం నాడు కేసీఆర్ హైదరాబాద్ దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్ ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని ఆరోపించారు. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి?ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Read Also : TGSRTC: మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ!