Site icon HashtagU Telugu

Ganja : వ‌రంగ‌ల్ రైల్వేస్టేష‌న్‌లో గంజాయి క‌ల‌క‌లం.. నాలుగు బస్తాల్లో గంజాయిని గుర్తించిన ఆర్పీఎఫ్‌

Ganja

Ganja

తెలంగాణ‌లో ఇటీవ‌ల గంజాయి ర‌వాణా అధికంగా జ‌రుగుతుంది.ఇటీవ‌ల కాలంలో గంజ‌యిని స్మ‌గ్లింగ్ పై పోలీసులు ప్ర‌త్యేక నిఘా పెట్టారు. గంజాయి ర‌వాణాని అరిక‌ట్టేంద‌కు తెలంగాణ పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయినప్ప‌టికి స్మ‌గ్ల‌ర్లు పోలీసులు క‌ళ్లుగ‌ప్పి గంజాయిని త‌ర‌లిస్తున్నారు. తాజాగా వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్‌లో గంజాయి క‌ల‌క‌లం రేపింది. నాలుగు గంజాయితో ఉన్న బ‌స్తాలు స్టేష‌న్‌లో ఉన్నాయి. దీని విలువ రూ.50 లక్షల అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) గుర్తించింది. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం…ఆదివారం స్టేషన్‌లో తనిఖీ చేస్తున్నప్పుడు రైల్వే పోలీసులు నాలుగు అనుమానాస్పద బ్యాగ్‌లను కనుగొన్నారని.. ఆ బ‌స్తాల‌ను తనిఖీ చేయ‌గా అందులో 50 కిలోల గంజాయి ఉన్న‌ట్లు గుర్తించారు. అధికారులు ఆ బ్యాగులను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల‌కు అందజేశారు.ఈ సంవత్సరంలో ఆర్‌పిఎఫ్ సికింద్రాబాద్ డివిజన్ డ్రగ్స్‌ను తీసుకెళ్తున్న 49 మందిని అరెస్టు చేసి సంబంధిత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు అధికారి తెలిపారు.