Ganja : హైద‌రాబాద్‌లో 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ పోలీసులు.. ఇద్ద‌రు అరెస్ట్‌

హైద‌రాబాద్‌లో గంజాయిని అక్ర‌మ ర‌వాణా విచ్చ‌లవిడిగా సాగుతుంది. ఎస్‌వోటీ పోలీసులు, ఉప్ప‌ల్ పోలీసులు సంయూక్తంగా

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 08:03 AM IST

హైద‌రాబాద్‌లో గంజాయిని అక్ర‌మ ర‌వాణా విచ్చ‌లవిడిగా సాగుతుంది. ఎస్‌వోటీ పోలీసులు, ఉప్ప‌ల్ పోలీసులు సంయూక్తంగా దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు కుంచాల శ్రీను (53), కాళ్ల రాము (43) ఆరు నెలల క్రితం ఒక‌రిని ఒక‌రు కలుసుకున్నార‌ని తెలిపారు. అయితే కాళ్ల రాము కమీషన్ ఇస్తాన‌ని చెప్పి.. కుంచాల శ్రీను ని ప్ర‌లోభ‌పెట్టి అత‌ని వాహనం తీసుకుని అక్రమంగా గంజాయి రవాణా చేశారు. 80 కిలోల బరువున్న 40 గంజాయి ప్యాకెట్లు, బొలెరో వాహనం, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ధనరాజ్ నుంచి 40 ప్యాకెట్లలో (ఒక్కొక్కటి రూ. 9,000) 80 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసేందుకు విశాఖపట్నంలోని సీలేరుకు నిందితులు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఉప్పల్ భగాయత్ మీదుగా శ్రీను, రాములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ధనరాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  HCA elections: హెచ్‌సీఏ ఎన్నికల్లో KTR, హరీష్ మద్దతు ఎవరికీ?