బీఆర్ఎస్ (BRS) పార్టీ లో ఇక లాస్ట్ కు కేసీఆర్ (KCR) ఫ్యామిలీ సభ్యులు మాత్రమే మిగులుతారా..? ప్రస్తుతం ఉన్న కొద్దీ గొప్ప ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ పక్క ప్లాన్ లో ఉన్నాడా..? అంటే అవును కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పోచారం కొడుకు, నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితోపాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమని చెప్పారు.
ఈయన చెప్పి కొద్దీ గంటలు కూడా కాలేదు..అప్పుడు బిఆర్ఎస్ సీనియర్ నేత , మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar)..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపి షాక్ ఇచ్చాడు. కొన్నిరోజులుగా గంగుల కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ లో గంగుల చేరుతున్నారని చర్చ జరిగింది. ఇప్పుడు కవ్వంపల్లి ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పడం తో గంగుల అతి త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
2000 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపాలిటీలో కార్పొరేటర్‌గా ఎన్నికైన కమలాకర్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో టీడీపీ టికెట్‌పై కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013లో తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర సమితి(BRS)లో చేరి 2014 , 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. కరీంనగర్ సాంప్రదాయకంగా వెలమ కులానికి బలమైన కోటగా పరిగణించబడుతుంది. అయితే ఇతర వెనుకబడిన తరగతి (OBC) కమ్యూనిటీకి చెందిన కమలాకర్ వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 2019లో కేసీఆర్ మంత్రివర్గంలో BC సంక్షేమం, ఆహారం & పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిఆర్ఎస్ లో కీలక నేత గా వ్యవహరించిన ఈయన..మరి బిఆర్ఎస్ ను వీడతారా అనేది చూడాలి.
Read Also : Purandheswari : జగన్‌పై సీబీఐ గురి..! పురందేశ్వరి భారీ ఆపరేషన్