Endangered Animals: తెలంగాణలో అడవులున్న పలు ఏరియాల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వన్యప్రాణులను అక్రమంగా బంధించి, రేటు కట్టి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఆయా వన్యప్రాణులను కడతేర్చి వాటి చర్మాలు, గోళ్లు, మాంసంతోనూ ఇష్టారాజ్యంగా బిజినెస్ చేస్తున్నారు. కొందరు స్మగ్లర్లు అయితే మరింత బరితెగించి అరుదైన వన్యప్రాణులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇలాంటి చీకటి దందా చేస్తున్న ఓ ముఠా గుట్టును చెన్నై కేంద్రంగా నడిచే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు రట్టు చేసింది.
Also Read :Kashmir CM : కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ఆర్టికల్ 370కి వ్యతిరేకం ఈ ఫలితం : ఫరూక్ అబ్దుల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పలువురు ఒక పాంగోలిన్(అలుగు)ను సమీపంలోని అడవుల్లో పట్టారు. దాన్ని ఒక ఆన్‌లైన్ వెబ్‌సైటు ద్వారా అమ్మకానికి పెట్టారు. కొనేందుకు ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదించాలంటూ ఒక వాట్సాప్ గ్రూపు నంబరును ఇచ్చారు. చెన్నై కేంద్రంగా నడిచే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు ఈ యాడ్‌ను, అందులోని వాట్సాప్ గ్రూపు వివరాలను గుర్తించింది. అలుగును కొనేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ అధికారులు ఆ వాట్సాప్ గ్రూప్‌లో (Endangered Animals) చేరారు. ఆ వాట్సాప్ గ్రూపులోని స్మగ్లర్లతో ఛాట్ చేసి అడ్రస్, ఇతర వివరాలు సేకరించారు. స్మగ్లర్లను కలిసేందుకు భూపాలపల్లి, కాటారం ప్రాంతాలకు చేరుకున్నారు.
Also Read :Airtel – Tata Play : జియోతో ఢీ.. ‘టాటా ప్లే’ను కొనేందుకు ఎయిర్‌టెల్ చర్చలు
అక్కడ అలుగును అమ్మేందుకు సిద్దమైన ముగ్గురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మాఫియాను తెర వెనుక నుంచి నడుపుతున్న మొత్తం ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు. వీరంతా కాటారం, భూపాలపల్లి, మహాముత్తారం మండలాలకు చెందిన వారని విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిని పోలీసులు విచారించగా..అలుగు, పులి, చిరుత, వాటి చర్మం, నక్షత్ర తాబేలు, రెండు తలల పాము, ఏనుగు దంతాలకు భారీగా డిమాండ్ ఉందని వెల్లడైంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని అడవుల్లో వన్యప్రాణులను తాము గతంలో వేటాడామని ఒప్పుకున్నారు.