Site icon HashtagU Telugu

Gang Rape : నిజామాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్

Gang Raped

Gang Raped

మొన్నటికి మొన్న హైదరాబాద్లో (Hyderabad) యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం (young woman was raped) చేసిన ఘటన ఇంకా మరవకముందే..ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో నిన్న రాత్రి నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న ఓ మహిళను ఆటోలో ఎక్కించుకుని డిచ్పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

దేశ వ్యాప్తంగా మహిళలకు , అభంశుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ అనేది కరువైంది. అర్ధరాత్రి పూట ఒంటరిగా మహిళ వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహానుభావులు అన్నారు. కానీ అది జరిగేలాలేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే ఒంటరిగా మహిళ (Woman) నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ మీదే కాదు ఇంట్లో కూడా ఉండలేని స్థితికి కామాంధులు తీసుకొచ్చారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వయసు తో సంబంధం లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అంతే కాదు స్కూల్ , హాస్టల్స్ ఇలా ప్రతి చోట ఇదే జరుగుతుంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు కామ పిశాచులు. ఈ ఘటనలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు.

ఇక తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు నగరానికి చేరుకుని శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని వన్​ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారానికి పాల్పడిన వారు డిచ్‌పల్లికి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత మహిళను వెంటబెట్టుకుని ఘటనాస్థలికి తీసుకెళ్లి పోలీసులు పరిశీలించారు. బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Read Also : Spirit : ప్రభాస్ సినిమాలో నటించడం లేదు – కరీనా క్లారిటీ