Gandhi Medical College Ragging : గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం..

ఇటీవల కాలంలో ర్యాగింగ్ ఘటనలు తగ్గాయి. అయినా అడపాదడపా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
gandhi medical college ragging

gandhi medical college ragging

మరోసారి గాంధీ మెడికల్ కాలేజ్ (Gandhi Medical College ) లో ర్యాగింగ్ (Ragging)కలకలం రేపింది. గత కొద్ది రోజుల క్రితమే గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ (Medical Students Suspended) చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా మరచిపోకముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. తాజాగా ర్యాగింగ్ కు పాల్పడిన మరో విద్యార్థిని కమిటీ సస్పెండ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల కాలంలో ర్యాగింగ్ ఘటనలు తగ్గాయి. అయినా అడపాదడపా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ విద్యార్థులపై సీనియర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ర్యాగింగ్ విష సంస్కృతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కొన్ని చోట్ల ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది.

సాధారణంగా కాలేజ్ విద్య, వికాసాన్ని అందించడంతోపాటుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడా అందిస్తుంది. కాలేజ్ లలో అల్లరి చేయడం సహజం. అల్లరి చెయ్యాలి కానీ ఆ అల్లరి కూడా అందంగా ఉండాలి. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలి. జూనియర్స్ ని సోదర భావంతో చూడాలి. కానీ కొంతమంది మాత్రం ఆలా కాకుండా రాక్షసులుగా మారుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. జూనియర్స్ పట్ల సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ దాడులకు పాల్పడుతూ..కాలేజ్ లనుండి సస్పెండ్ కు గురి అవుతున్నారు. ఇక ఇప్పుడు గాంధీలో కూడా అదే జరిగింది.

Read Also : Leo: ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్.. థియేటర్ లో అభిమాన జంట ఎగేంజ్ మెంట్

  Last Updated: 20 Oct 2023, 01:19 PM IST