Site icon HashtagU Telugu

Gandhi Family : గాంధీ కుటుంబం హామీ ఇస్తే అది వంద శాతం నెరవేరుతుంది – సీఎం రేవంత్

CM Revanth Instructions

CM Revanth Instructions

గాంధీ కుటుంబం (Gandhi Family)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే, ఆ మాట వంద శాతం నెరవేరుతుందని, హామీ ఇచ్చాక మరో చర్చకు తావు ఉండదని అన్నారు. బుధువారం గాంధీ భవన్‌లో జరిగిన కుల గణనపై అవగాహన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని , కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టడంలో గాంధీ కుటుంబం స్ఫూర్తిదాయకంగా ఉందని ఆయన అన్నారు.

ప్రజలు హామీలను నిలబెట్టుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు బాధ్యత అని , ప్రజల్లోకి పార్టీ అజెండాతో వెళ్లి, కాంగ్రెస్ విధానాలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీలో కృషి చేస్తేనే ఫలితం దక్కుతుందని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. తనకు సీఎం బాధ్యత కష్టపడి పనిచేసినందునే లభించిందని, అందరూ అలాగే కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ప్రధాని మోదీపై పోరాటాన్ని చేపట్టాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నవంబర్ 31 లోపు కుల గణన పూర్తి చేయాలని, కుల గణన తెలంగాణ మోడల్‌ రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also : Virat Kohli Captain: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. మ‌రోసారి కెప్టెన్‌గా!