Site icon HashtagU Telugu

Gadwal MLA: ఉద్యోగి గల్లా పట్టిన గద్వాల్ ఎమ్మెల్యే, వీడియో వైరల్!

Viral

Viral

తెలంగాణ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. నవంబర్ 22న రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్న అధికారి వెంకట్ రెడ్డిని దూషించిన ఘటన చర్చనీయాంశమవుతోంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో బాలికల కోసం తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJPTBCWREIS). ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అతిథిగా హాజరుకావాల్సి ఉంది. ఆయన సకాలంలో రాకపోవడంతో ప్రారంభోత్సవం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే సదరు అధికారిని దుర్భాషలాడడం కెమెరాకు చిక్కారు.

తానులేకుండా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రిన్సిపాల్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించడం కనిపించింది. తాను వచ్చే సమయానికి ప్రారంభం జరిగిందనీ, అరగంటలో వస్తానని చెప్పాను కదా అని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యే అకస్మాత్తుగా వెనక్కి తిరిగి, అధికారి కాలర్‌ను పట్టుకుని, అతన్ని నెట్టడం చూడవచ్చు. చెప్పుతో కొడతానని, తీవ్ర పదజాలంతో దూషించిన తీరు వీడియోలో చూడొచ్చు.

ఎమ్మెల్యే లేకపోవడంతో సమయానికి స్థానిక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత పాఠశాలను ప్రారంభించారని స్థానికులు పేర్కొన్నారు. చివరకు అధికారులు ఒప్పించడంతో మిగిలిన తరగతి గదులను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ ప్రారంభించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి పట్ల ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version