BRS Joins: తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది బీఆర్ఎస్ లో చేరారు. వారితోపాటు మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని సీఎం కెసిఆర్ గారితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేసి అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్లో ముఠా సంస్కృతులను వ్యతిరేకిస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపుకు కృషి చేస్తాం అన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని, గద్వాలలో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింది. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
గద్వాల కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరినవారు
పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
బంగి ప్రియాంక MIM కౌన్సిలర్,
బంగి సుదర్శన్ ఎమ్ ఎమ్ టౌన్ ప్రెసిడెంట్, రఘు నాయుడు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు,
శ్రీకాంత్ గౌడ్ ధరూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
విశ్వనాథ్ రెడ్డి కేటి దొడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
ఉమాదేవి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎక్స్ జడ్పిటిసి,
పూల కర్ణాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు,
అల్క్జాండర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు,
విజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ.