Site icon HashtagU Telugu

Gaddar Daughter Vennela : కాంగ్రెస్ టికెట్ ఫై గద్దర్ కూతురు కీలక వ్యాఖ్యలు

Gaddar Daughter Vennela

Gaddar Daughter Vennela

కాంగ్రెస్ టికెట్ ఫై దివంగ‌త ప్ర‌జా గాయ‌కుడు గద్దర్ (Gaddar ) కూతురు వెన్నెల (Gaddar daughter Vennela) కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్ నెలలో జరగబోయే ఎన్నికల పోటీలో ఉంటాన‌ని వెన్నెల స్ప‌ష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. అయితే.. అధికార బీఆర్ఎస్ (BRS) తప్ప.. మిగతా పార్టీలేవీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో వెన్నెల ఎన్నికల బరిలో నిలువ బోతుందని , కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుండి బరిలోకి దిగబోతుందంట గత కొద్దీ రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలో నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2023, అక్టోబర్ 21వ తేదీ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ..తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నానని.. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేస్తాని తేల్చి చెప్పారు. కొన్ని రోజులుగా తన పేరు మీడియాలో వస్తోందని.. అదే క్రమంలో రాజకీయాల్లోకి రమ్మని చాలా మంది తనపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. తనకు కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని.. మాలో ప్రజల కోసం కొట్లాడాలనే ఫైటింగ్ స్పిరిట్ ఉందన్నారు. తనకు కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తానన్నారు. మా నాన్న చివర్లో కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఓడిపోయినా సరే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించారని తెలిపారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

Read Also : Gaza Border : గాజాలోకి మానవతా సాయం తరలింపు షురూ