ప్రజా నాట్య మండలి మాజీ నాయకుడు, కళాకారుడు గద్దర్ (Gaddar) తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు కళకే పరిమితమైన ఆయన మారుతున్న పరిస్థితుల కారణంగా రాజకీయాలోనూ చురుకైన పాత్ర వహించాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో గద్దర్ ప్రత్యక్షమై తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ది గద్దర్ పార్టీ (రిజిస్ట్రేషన్ కాలేదు) అనే పేరుతో రాజకీయ పార్టీ (Political Party) పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్వాల్ లో ఉంటున్న గద్దర్ తూప్రాన్ లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తనకు తగినంత భద్రత కల్పించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ క్రమంలో ఆయన లెటర్ ప్యాడ్ ది గద్దర్ పార్టీ పేరుతో విడుదల చేయడం అందర్నీ ఆకర్షించింది. అయితే త్వరలో కవులు, కళాకారులతో కలిసి దాదాపు 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ బరిలో పోటీలో నిలుస్తానని, కేసీఆర్ (CM KCR) పై పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం గద్దర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.
తన వయసు 76 సంవత్సరాలని, ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు గద్దర్ (Gaddar) ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తమ గ్రామంపై మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు. ప్రజలు ఆశీర్వదిస్తారా? లేదా? అన్నది పక్కన పెట్టి తాను పోటీలో ఉంటానని గద్దర్ ప్రకటించారు.
Also Read: Manobala Passes Away: షాకింగ్.. ప్రముఖ హాస్యనటుడు మనోబాల ఇకలేరు!