Site icon HashtagU Telugu

Gaddar film awards : 2014 నుండి 2023 సినిమాలకు గద్దర్ అవార్డుల ప్రకటన

Gaddar Awards announced for films from 2014 to 2023

Gaddar Awards announced for films from 2014 to 2023

Gaddar film awards : తెలంగాణ ప్రభుత్వం పురస్కారాల రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, విప్లవకారుడు గద్దర్ గారి స్మరణలో “గద్దర్ అవార్డులు” ప్రారంభించనుందని ప్రముఖ సినీనటుడు, మాజీ పార్లమెంటరీ సభ్యుడు మురళీమోహన్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ మరియు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు గద్దర్ అవార్డుల వివరాలను వెల్లడించారు. 2014 జూన్‌ 2వ తేదీ నుంచి 2023 డిసెంబర్ వరకు విడుదలైన ఉత్తమ చిత్రాలకు ఈ అవార్డులు అందించనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఏడాది ఉత్తమంగా నిలిచిన మూడు సినిమాలకు గద్దర్ అవార్డు అందించనున్నారు. మొత్తం 10 సంవత్సరాల కాలప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 30 సినిమాలకు అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు.

ఈ అవార్డుల ఎంపికలో సినీ విమర్శకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఉండే జ్యూరీ కమిటీ తీర్పును ఆధారంగా తీసుకుంటారు. కేవలం కమర్షియల్ విజయం కాదు, సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేసిన చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తారని మురళీమోహన్ పేర్కొన్నారు. గద్దర్ గారి సేవలను, వారి భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ అవార్డులు ఉండాలి అని ఆయన చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ..తెలంగాణ సినిమాకు ఇది గౌరవకరమైన దశ. స్థానికంగా తెరకెక్కిన మంచి సినిమాలకు ఈ అవార్డులు మన్ననగా నిలుస్తాయి. గద్దర్ గారి పేరు మీద ఉండడం మరింత బాధ్యతను కలిగిస్తుంది అన్నారు. ఈ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఉత్తమ చిత్రాలివే..

2014
ఉత్తమ చిత్రం: రన్‌ రాజా రన్‌
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శ్రీను

2015
ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు

2016
ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్‌

2017
ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజి

2018
ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్‌ కంచరపాలెం

2019
ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం

2020
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్‌ ఫొటో
మూడో చిత్రం: మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌

2021
ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన

2022
ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్‌

2023
ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్‌
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

Read Also: Pakistan: సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత..రాజీ అనేది అసంభవం : అసీం మునీర్ ఘాటు వ్యాఖ్యలు