తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సినిమా రంగ ప్రతిభను సత్కరించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards ) కార్యక్రమం జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్ (Hyderabad Hitex) వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. కొంత విరామం తర్వాత తిరిగి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం పట్ల సినీ రంగ ప్రముఖులలో, ప్రేక్షకులలో విశేష ఉత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమాటిక్ ప్రతిభను ప్రోత్సహించేందుకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ప్రణాళికాబద్ధంగా పునరుద్ధరించింది.
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
ఈ అవార్డులకు 2024లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు, 2014 జూన్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ పొందిన కొన్ని ప్రత్యేక చిత్రాల నుండి ఉత్తమ ప్రతిభను కనబరిచినవారిని ఎంపిక చేశారు. ఇప్పటికే విజేతల జాబితాను ప్రకటించారు. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు హైటెక్స్ వేదికను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియం విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలుగు సినీ తారలు, దర్శక నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకావాలని ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. జూన్ 14న జరగనున్న ఈ వేడుక తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.