Gaddar: గద్దర్ అంటే ఓ విప్లవకారుడు. పడుకున్న సమాజాన్ని తన పాటలతో మేలుకొల్పే ప్రజా గాయకుడు. తన పాటల తూటాలతో ప్రభుత్వాలని ప్రశ్నించగలడు. తెలంగాణ సమాజం కోసం, అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్న మహా వ్యక్తి. అనారోగ్య సమస్యలతో గద్దర్ ఇప్పుడు మన మధ్య లేరు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన పాటల ద్వారా ప్రతిఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు.
గద్దర్ మరణం అనంతరం అత్యంత బాధాకర విషయం ఒకటి బయటకు వచ్చింది. సీఎం కేసీఆర్ ని కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎండలో నిల్చోపెట్టారు. దాంతో గద్దర్ ఆపాయిట్మెంట్ దొరికే వరకు ప్రగతి భవన్ గేటు బయట కూర్చుని ఉన్నారు. గద్దర్ పై ఉన్న అభిమానంతో గేటు వద్ద సెక్యూరిటీ చిన్న కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆ ఫోటో చూస్తుంటే కేసీఆర్ మనస్తత్వం ఏంటో అర్ధం అవుతుంది.
గద్దర్ సీఎం కేసీఆర్ ని కలవడానికి రెండు సార్లు ప్రయత్నం చేశాడట. 2023 ఫిబ్రవరి 28వ తేదీ గద్దర్ ప్రగతిభవన్ వెళ్లి 3గంటలు గేట్ దగ్గర ఎండలో కూర్చొని సీఎంని కలవడానికి అనుమతి కోరిండు. అయితే ఎంతసేపటికీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో గద్దర్ వెనుదిరగాల్సి వచ్చింది. బతికి ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడక అవమానించిన కేసీఆర్ చనిపోయాక అధికార లాంఛనాలు అని గద్దరన్న ఇంటికి పోయి ఓట్ల వేట మొదలు పెట్టిండు అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Also Read: AP BRS: వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలు సిద్దం