Site icon HashtagU Telugu

Loksabha : సింగరేణి వాసుల కోసం లోక్ సభలో గళం విప్పిన ఎంపీ వంశీ కృష్ణ గడ్డం

Gvk

Gvk

సింగరేణి కాలనీల్లో నివసించే వాసులంతా రైల్వేకు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తున్నారు. ప్రతీ సంవత్సరం సింగరేణి ప్రాంతాల నుంచి రైల్వేకు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రజలకు కనీస రైలు సౌకర్యాలు లభించకపోవడం బాధాకరం. ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో కనెక్టివిటీ లేక చాలామంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Earthquake In Russia : రష్యా లో భారీ భూకంపం వస్తుందని ముందే హెచ్చరించిన రియో టాట్సు

ఇప్పటి వరకు అనేకసార్లు వందే భారత్ రైలు మరియు కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు అవసరమని కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. కానీ ఇప్పటికీ ఈ అంశంపై సరైన స్పందన లేదు. వందే భారత్ రైలు వంటి హైస్పీడ్ కనెక్టివిటీ వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు ప్రయాణించడం సులభతరంగా మారుతుంది. కేరళ ఎక్స్‌ప్రెస్ రీస్టోరేషన్ కూడా ప్రయాణికుల భద్రత, వేగం దృష్ట్యా అత్యవసరంగా మారింది.

ఈ నేపధ్యంలో ఎంపీ వంశీ కృష్ణ గడ్డం లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. మేలు జరుగుతుందనే ఆశతో ఇప్పుడు సింగరేణి వాసులంతా కేంద్రం నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తగిన రైలు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.