తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ను ఎన్నికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది. వికారాబాద్ ఎమ్మెల్యే (Vikarabad MLA) గా గడ్డం ప్రసాద్ కుమార్ విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
గడ్డం ప్రసాద్ కుమార్ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు. 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. గడ్డం ప్రసాద్‌కుమార్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేసారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క తెలంగాణ ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి (Revanth Reddy CM) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఈ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. వేలాదిమంది ఈ వేడుకను చూసేందుకు తరలివచ్చారు. LB స్టేడియం చుట్టూ కాంగ్రెస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఇక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అప్పటివరకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీగా నాయకుడిగా ప్రమోట్ చేస్తూ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మధ్యాహ్నం 1:04 నిమిషాలకు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా వేదికపైకి చేరుకున్నారు.
Read Also : Revanth Reddy Biopic : రేవంత్ బయోపిక్ ను ప్రకటించిన బండ్ల గణేష్