Site icon HashtagU Telugu

TS : కాంగ్రెస్ ఎంపీ టికెట్ కు మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు దరఖాస్తు..

Gadala Srinivas

Gadala Srinivas

కరోనా (Corona) సమయంలో కరోనా జాగ్రత్తలు చెపుతూ ప్రజలకు సుపరిచితుడైన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు (Ex Health Director Dr Gadala Srinivasa Rao)..తాజాగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ (Congress MP Ticket) కోసం దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. కరోనా సమయంలో జాగ్రత్తలు చెప్పిన శ్రీనివాస్ రావు..ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అలాగే నిత్యం కేసీఆర్ భజన చేస్తూ వార్తల్లో నిలిచాడు. కేసీఆర్ లేకపోతే ..తెలంగాణ లేదు..తెలంగాణ కు అన్ని కేసీఆరే అంటూ చెపుతూ.. తాను ఓ ప్రభుత్వ అధికారినేనే విషయాన్నీ మరచి , బిఆర్ఎస్ నేతగా ఎప్పుడు కేసీఆర్ భజన చేస్తూ వచ్చాడు. ఇదంతా కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసాడు..కానీ కేసీఆర్ పట్టించుకోకపోయేసరికి..ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీ భవన్లో లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన సన్నిహితుడు రాము అప్లికేషన్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సాహించింది. 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సర్వీసులోనే ఉన్న గడల దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు ఒక్కరోజే వంద మంది ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు మొత్తం 140కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయని సమాచారం.

Read Also : Cervical Cancer : పూనమ్ మృతితో సర్వేకల్ క్యాన్సర్ ఫై ఆరా..!!