G Chinnareddy : చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

G Chinnareddy : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవిని కేటాయించారు.

  • Written By:
  • Updated On - February 24, 2024 / 04:05 PM IST

G Chinnareddy : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవిని కేటాయించారు. తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. చివరకు చిన్నారెడ్డి (G Chinnareddy) స్థానంలో మేఘా రెడ్డికి పార్టీ అవ‌కాశాన్ని క‌ల్పించింది. నిరంజ‌న్ రెడ్డిపై భారీ మెజార్టీతో మేఘా రెడ్డి గెలిచారు.

We’re now on WhatsApp. Click to Join

చిన్నారెడ్డి పొలిటికల్ కెరీర్

  • చిన్నారెడ్డి వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 1985లో యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌గా ఉన్న చిన్నారెడ్డి.. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి బాల‌కృష్ణ‌య్య చేతిలో ఓడిపోయారు.
  • 1989లో మ‌ళ్లీ పోటీ చేసి బాల‌కృష్ణ‌య్య‌పై గెలిచి తొలిసారి శాస‌న‌స‌భ‌లోకి చిన్నారెడ్డి అడుగుపెట్టారు.
  • 1994 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేతిలో చిన్నారెడ్డి ఓడిపోయారు.
  • 1999 ఎన్నిక‌ల్లో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై చిన్నారెడ్డి 3,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  • 2004 ఎన్నిక‌ల్లోనూ చిన్నారెడ్డి గెలిచారు. వైఎస్సార్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చిన్నారెడ్డి ప‌ని చేశారు.
  • 2009 ఎన్నిక‌ల్లో రావుల చేతిలో చిన్నారెడ్డి ఓడిపోయారు.
  • 2014 ఎన్నిక‌ల్లో చిన్నారెడ్డి గెలిచారు.
  • మొత్తంగా తన పొలిటికల్ కెరీర్‌లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి ఎన్నిక‌య్యారు.
  • 2018 ఎన్నిక‌ల్లో నిరంజ‌న్ రెడ్డి చేతిలో చిన్నారెడ్డి ఓడిపోయారు.
  • 2021లో జ‌రిగిన హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి చిన్నారెడ్డి ఓట‌మిని చ‌వి చూశారు.

Also Read : New Criminal Laws : కొత్త క్రిమినల్ చ‌ట్టాల అమలుకు డేట్ ఫిక్స్