భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence (AI)) ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను తెలంగాణలో ప్రారంభించింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీ ప్రారంభించడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు.
Honey: కాలిన గాయాలు మొటిమలు మాయం అవ్వాలంటే తేనెతో ఈ విధంగా చేయాల్సిందే!
మైక్రోసాఫ్ట్-తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో AI విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, పబ్లిక్ సర్వీసెస్‌లో AI వినియోగాన్ని ప్రోత్సహించనున్నారు. దీనిద్వారా విద్యార్థులకు నూతన అవకాశాలు లభించడంతో పాటు, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరగనుంది. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం కలిసి AI సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్ ఆధునిక AI పరిశోధన, డేటా సెంటర్లు, క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలతో నైపుణ్యాలను పెంపొందించనుంది. ఈ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 1.2 లక్షల మందికి పైగా AI శిక్షణ అందించనున్నారు.
రాష్ట్రంలో AI విస్తరణను బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. AI పరిశ్రమలో యువతకు శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాలు విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉద్యోగులు అనే మూడు విభాగాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్రం ఒక గ్లోబల్ AI హబ్‌గా మారనుంది. దీనివల్ల టెక్నాలజీ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.