Telangana Budget – 2024 : తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. అందులో తెలంగాణకు ఎంత మేర నిధులను కేటాయిస్తారనే దాన్ని రాష్ట్ర సర్కారు(Telangana Budget – 2024) విశ్లేషించుకోనుంది. తదుపరిగా అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలుకు పెద్దపీట వేస్తూ తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ పథకాలకు కేటాయింపులలో ప్రయారిటీ దక్కొచ్చని భావిస్తున్నారు. రైతు రుణమాఫీ పథకానికి నిధులను సమకూర్చుకునేందుకు రుణాల సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్ శాఖలకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉంటాయని అంటున్నారు.
Also Read :Firing At Trump : ట్రంప్‌పై కాల్పులు.. షూటర్ గురించి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..
- గృహజ్యోతి పథకానికి సంబంధించి విద్యుత్ రాయితీ పద్దు కింద రూ.15 వేల కోట్లు కావాలని విద్యుత్ డిస్కంలు కోరుతున్నాయి. రాష్ట్రంలోని ఇళ్లకు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత కరెంటుకు నెలకు రూ.150 కోట్లు అవసరం అవుతాయని డిస్కంలు అంటున్నాయి.
- సాగు నీటి ప్రాజెక్టుల మిగిలిన పనులకు రూ.19,500 కోట్లు కావాలని నీటి పారుదల శాఖ కోరుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలు సొమ్ము కిస్తీల చెల్లింపులకూ భారీగా నిధులు అవసరం అని చెబుతోంది.
- వ్యవసాయ శాఖకు ఈ ఏడాది రూ.55 వేల కోట్లను వరకు కేటాయిస్తారని, అందులో రూ.31 వేల కోట్లకుపైగా రుణమాఫీకే ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు.
- రైతు భరోసా స్కీంకు ఈ ఏడాది కూడా దాదాపు రూ.14వేల కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ కోరుతోంది.