తెలంగాణ (Telangana ) లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)…ఇప్పటికే అనేక పథకాలను తీసుకురాగా..తాజాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకరాబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశం కలిపిస్తూ ‘తెలంగాణ దర్శిని’ (Telangana Darshini) అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి విద్యార్థులకు ఒక రోజు ట్రిప్పులుగా పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళ్తారు. వీరికి హెరిటేజ్ సైట్లు, పార్కులు, మాన్యుమెంట్లు చూపించడం ద్వారా చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరించనున్నారు. అలాగే 5 నుంచి 8 వ తరగతి విద్యార్థుల కోసం 20-30 కిలో మీటర్ల పరిధిలో డే ట్రిప్స్ ఉంటాయి. ఈ ట్రిప్స్ లో తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించి.. అక్కడ విశిష్టతలను విద్యార్థులు తెలుసుకునేలా చేస్తారు.
ఇక 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రోజుల పాటు 50-70 కిలో మీటర్ల పరిధితో లాంగ్ ట్రిప్స్ నిర్వహిస్తారు. ఇందులో స్థానిక చరిత్ర, సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునేలా అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీ విద్యార్థులకు నాలుగు రోజుల పాటు, వారి సొంత జిల్లాలు దాటి సుదూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లే ఏర్పాటు చేయనున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల సందర్శించడం ద్వారా విద్యార్థులకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందని, కేవలం పుస్తకాల్లో పాఠాలకే పరిమితం కాకుండా, అనుభవజ్ఞానం లభిస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్దిపై టీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణ ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
Read Also : Hassan Nasrallah : హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి