సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ నేత పడమటి అనంతరెడ్డి (Padamati Anantha Reddy) కనుమ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ స్టీల్ బాక్సుల్లో ఫ్రీ గా మటన్ మాంసం పంపిణీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు 400 కుటుంబాలకు మాంసం (Mutton) అందించగా, మిగతా 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. గతంలోనూ ఇలాగే ప్రజలకు అండగా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. కొవిడ్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడినప్పుడు, ఇంటి వద్దకే నిత్యావసరాలు అందజేసి ప్రశంసలు అందుకున్నారు.
Minister Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: మంత్రి శ్రీధర్ బాబు
ఇప్పుడు కనుమ పండుగ సందర్భంలో మటన్ పంపిణీ చేయడం అతని ఉత్సాహానికి, ప్రజల పట్ల ఉన్న ప్రేమకు ఉదాహరణగా నిలిచింది. కనుమ పండుగ సందర్భంగా గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల నుండి కూడా మాంసం పంపిణీపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. పండుగకు సంబంధించి గ్రామస్తులకు కావలసినవి అందించడంతో అనేక కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. నాన్‌వెజ్ వంటకాలు ఈ పండుగలో ముఖ్యమైనవిగా ఉండటంతో, గ్రామంలోని ప్రజలు ఈ సహాయాన్ని హర్షించారు. పండుగ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నాన్‌వెజ్ కోసం భారీ డిమాండ్ నెలకొంది. చికెన్ సెంటర్ల వద్ద ప్రజలు క్యూలో నిలబడి కొనుగోళ్లు చేస్తున్నారు. బాయిలర్ చికెన్ ధర రూ.250 కి పైగా ఉండగా, మటన్, నాటుకోడి మాంసానికి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. విక్రయదారులు ముందే కోళ్లు, మేకలు సిద్ధం చేసి ప్రజల అవసరాలను తీర్చే ప్రయత్నం చేశారు.
కనుమ పండుగ రోజున బంధుమిత్రులు అందరూ కలుసుకుని నాన్‌వెజ్ వంటకాలతో విందు చేయడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. పండుగ సంబరాల్లో భాగంగా మాంసం పంపిణీ చేసి గ్రామస్తులందరినీ ఆనందపరిచిన అనంతరెడ్డి చర్య ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.