Free Heart Surgeries : నిమ్స్ లో ఫ్రీగా పిల్లలకు హార్ట్ సర్జరీలు.. ఎప్పటి నుంచి అంటే ?

Free Heart Surgeries :  గుండె జబ్బులు వస్తే.. చికిత్స కోసం వైద్య ఖర్చులు భారీగా ఉంటాయి.  ప్రత్యేకించి పిల్లలకు ఆ ప్రాబ్లమ్స్ వస్తే పేరెంట్స్ ఎంతో మానసిక వేదనకు లోనవుతారు.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 09:42 AM IST

Free Heart Surgeries :  గుండె జబ్బులు వస్తే.. చికిత్స కోసం వైద్య ఖర్చులు భారీగా ఉంటాయి.  ప్రత్యేకించి పిల్లలకు ఆ ప్రాబ్లమ్స్ వస్తే పేరెంట్స్ ఎంతో మానసిక వేదనకు లోనవుతారు. ఇలాంటి వారికి చేదోడుగా ఉండేలా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 30 వరకు నిమ్స్‌లో పిల్లలకు  గుండె సర్జరీలు ఫ్రీగా చేయనున్నారు. లక్షలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగే స్థోమత లేని వారికి ఇది మంచి అవకాశం. బ్రిటన్‌ వైద్యులు, నీలోఫర్‌ డాక్టర్స్, నిమ్స్‌ వైద్య నిపుణులు ఒక టీమ్ గా ఏర్పడి పిల్లలకు ఫ్రీగా ఈ హార్ట్ సర్జరీలు చేస్తున్నారు. ఈవిషయాన్ని నిమ్స్ డైరెక్టర్‌ నగరి బీరప్ప మీడియాకు తెలిపారు. ఈ ఉచిత గుండె సర్జరీల క్యాంపునకు  ‘చార్లెస్‌ హార్ట్‌ హీరోస్‌ క్యాంపు’ అని పేరు పెట్టారు. బ్రిటన్‌ పీడియాట్రిక్‌ వైద్యులు డాక్టర్‌ దన్నపునేని రమణ ఆధ్వర్యంలో పదిమంది డాక్టర్స్ ఈ సర్జరీలు చేసేందుకు నిమ్స్ కు వస్తున్నారని చెప్పారు.

Also read : Chandrababu Remand: నాతో కలిసి వచ్చేది ఎవరు?

అప్పుడే పుట్టిన శిశువుల దగ్గరి నుంచి ఐదేళ్ల పిల్లల దాకా పుట్టుకతో, జన్యుపరంగా వచ్చే గుండె జబ్బులకు ఈ నెల 24 నుంచి 30 వరకు సర్జరీలు, ఇతర వైద్య చికిత్సలు ఉచితంగా (Free Heart Surgeries)  చేస్తారని వివరించారు. ఆరోగ్యశ్రీ, సీఎం సహాయనిధితో ఈ సర్జరీలు జరుగుతాయని తెలిపారు. గత ఏడాది కూడా ఇదేవిధంగా వారంపాటు ఫ్రీగా గుండె ఆపరేషన్లు నిర్వహించి 9 మంది పిల్లల ప్రాణాలను నిలబెట్టారు. నిమ్స్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అమరేశ్వరరావు సారథ్యంలో రోజూ సగటున 3 సర్జరీలు చేయనున్నారు. పూర్తి వివరాలకు 040-23489025 నంబరుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు కాల్ చేయొచ్చు.