Site icon HashtagU Telugu

Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం హైదరాబాద్​లో 11 లక్షల మందికే.. ఎందుకు ?

Gruha Jyothi

Gruha Jyothi

Gruha Jyothi : రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ఉద్దేశించిన  ‘గృహజ్యోతి’ స్కీంపై ఇప్పుడు అందరి  దృష్టి ఉంది. దీని అమలు ప్రక్రియపై తెలంగాణ సర్కారు కసరత్తును వేగవంతం చేసింది. తొలి విడతగా హైదరాబాద్​లో 11 లక్షల మందికే ‘గృహజ్యోతి’ స్కీంను అమలు చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ‘సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ (సీజీజీ)కు చేరింది. మార్చి నెలలో ఈ 11 లక్షల మందికే సున్నా బిల్లులు జారీ అవుతాయి.

We’re now on WhatsApp. Click to Join

‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా గృహజ్యోతి స్కీం (Gruha Jyothi) కోసం వినియోగదారులు సమర్పించిన అప్లికేషన్ల ధ్రువీకరణ ప్రక్రియను బిల్లుల జారీ సమయంలోనే విద్యుత్ సిబ్బంది చేపట్టారు. ఈ ప్రాసెస్ ఇంకా పలుచోట్ల కొనసాగుతోంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటివరకు 30 లక్షల మంది వినియోగదారుల వివరాల ధ్రువీకరణను కంప్లీట్ చేసి సీజీజీకి వివరాలను అందజేశారు.అయితే ఇందులో హైదరాబాద్​కు చెందిన వినియోగదారులు 11 లక్షల మందే ఉన్నారు. అత్యధికంగా హబ్సిగూడ సర్కిల్‌ పరిధిలోని 1.62 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ స్కీం వర్తించే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 1.59 లక్షల ఇళ్లు, సరూర్‌నగర్‌ సర్కిల్‌లో 1.47 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌ సౌత్‌లో 1.27 లక్షల ఇళ్ల పరిశీలన పూర్తయింది. బంజారాహిల్స్‌ సర్కిల్‌లో 59వేల మంది వినియోగదారులు గృహజ్యోతికి అప్లై చేయగా.. మిగతా సర్కిళ్లలో అప్లికేషన్లు లక్షలోపే ఉన్నాయి.

Also Read : CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ

రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో.. అది లేని వారిని అర్హులుగా పరిగణించడం లేదు.  దీంతో గృహజ్యోతి స్కీంకు  అప్లై చేసుకున్న వారిలో 55 శాతం మందికే ఈ స్కీం వర్తించే  ఛాన్స్ ఉంది. తెలంగాణ సర్కార్ జారీ చేసే మార్గదర్శకాలను బట్టి ఈ సంఖ్య ఇంకా తగ్గొచ్చు కూడా!! ప్రజా పాలనలో జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చిన 19.85 లక్షల దరఖాస్తుల్లో గృహజ్యోతి  మ్యాపింగ్‌ ప్రక్రియ 11 లక్షల వరకే జరిగింది. ఇంకా 8.85 లక్షల దరఖాస్తుదారులు ఏమైనట్లు? అధికారులేమో 99 శాతం పూర్తయిందని చెబుతున్నారు. ఒక ఇంట్లోనే రెండు అర్జీలు రావడం, వేర్వేరు పోర్షన్లలో నాలుగు కుటుంబాలు ఉంటున్న అందరికి కలిపి ఒకటే మీటర్‌ ఉండటం ఊర్లో, ఇక్కడ దరఖాస్తు చేయడమని అంటున్నారు.  ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 19.85 లక్షల మంది గృహజ్యోతి స్కీంకు అప్లై చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలు కంటిన్యూ.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్