కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉచిత కరెంట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తుందా అని వెయ్యి కళ్లతో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల లోపు వారికీ ఫ్రీ కరెంట్ అని హామీ ఇచ్చింది. ఈ హామీ పట్ల ప్రజలు ఎంతో సంబరపడి..ఓట్లు గుద్దేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో పడింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. ఇక ఇప్పుడు రూ.500 లకే గ్యాస్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ (గృహ జ్యోతి ) పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఫ్రీ కరెంట్ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ వస్తుందా..? ఎవరికీ వస్తుంది..? ఎవరికీ రాదు..? ఫ్రీ కరెంట్ కావాలంటే ఏమిచేయాలి..? ఇలా అనేక ప్రశ్నలు అందరిలో కలుగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఉచిత కరెంట్ పొందాలనుకునే వారికి ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్‌కు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. మీరు 2022-23లో 2,376 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఉపయోగించి ఉండరాదనే కొన్ని కండీషన్స్ అయితే ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతమైతే ఈ కండిషన్స్ చెపుతున్నారు..ఇవేనా..ఇంకేమైనా యాడ్ అవుతాయా..? అనేది చూడాల్సి ఉంది.
అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్లు కాగా.. అందులో ఆరు గ్యారంటీల అమలుకు పెద్ద పీట వేస్తూ రూ. 53,196 కోట్ల నిధులు కేటాయించింది. దీంట్లో ప్రత్యేకంగా గృహజ్యోతి పథకం అమలు కోసం 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఉచిత విద్యుత్తు అమలు కోసం విద్యుత్ రంగానికి రూ,16,825 కోట్లు ఇచ్చింది.