తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం (Free Bus for Ladies in Telangana ) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా, ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తొలిరోజు వెసులుబాటు కల్పించగా, శనివారం నుంచి చర్యలు తీసుకుంటున్నారు. స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపితేనే జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. ఐడీ లేకపోతే ఛార్జ్ చెల్లించాల్సిందే..ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణించాలను కుంటే రూ.500 జరిమానా విధించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ శనివారం స్పష్టం చేసింది.