Ex-MP: ఢిల్లీలో కిడ్నాప్ కలకలం.. ఆ నలుగురు ఎక్కడ!

దేశ రాజధానిలోని తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు (MP) జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురిని కిడ్నాప్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు తెలిపారు.

  • Written By:
  • Updated On - March 2, 2022 / 03:35 PM IST

దేశ రాజధానిలోని తెలంగాణ మాజీ పార్లమెంటు సభ్యుడు (MP) జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురిని కిడ్నాప్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు. ఢిల్లీ పోలీస్ PRO సుమన్ నల్వాకు సౌత్ అవెన్యూలో ఫిర్యాదు అందినట్లు తెలిపారు. సౌత్ అవెన్యూ నంబర్ 105 ఫ్లాట్‌లో ఉంటున్న నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు పోలీసు స్టేషన్‌లో తెలిపారు. ఆ నలుగురిలో ముగ్గురు ఇప్పుడు బీజేపీలో ఉన్న మాజీ పార్లమెంటేరియన్‌కు అతిధులుగా ఉన్నారని, నాలుగో వ్యక్తి తిలక్ థాపా డ్రైవర్ అని నల్వా చెప్పారు. కిడ్నాప్‌కు గురైన వారిలో ఒకరు మహబూబ్‌నగర్ జిల్లా మున్నూరు రవి తెలంగాణవాదిగా గుర్తించారు. ఈ ఫిర్యాదు అందిన తరువాత, సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 365 కింద కేసు నమోదైంది.

కాగా, తెలంగాణ మాజీ ఎంపీ సోమవారం రాత్రి తన వ్యక్తిగత డ్రైవర్ థాపా, సామాజిక కార్యకర్త మున్నూరు రవిని కిడ్నాప్ చేసినట్లు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు. “నేను సంబంధిత పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశాను. సత్వర న్యాయం కోసం ఆశిస్తున్నాను” అని రెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాదు.. మాజీ ఎంసీ సీసీటీవీ విజువల్స్ కూడా షేర్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కొంతమంది వ్యక్తులను బలవంతంగా కారులోకి ఎక్కించడం కూడా చూడొచ్చు. ఢిల్లీలో తన నివాసం ఉన్న ప్రాంతంలో తరచుగా వీఐపీల సంచారం ఉంటుందని మాజీ ఎంపీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో.. మాజీ ఎంపీ ఇంట్లో నుంచి నలుగురు కిడ్నాప్ కు గురికావడంతో ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.