Site icon HashtagU Telugu

BRS MLAS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ లో చేరతారా..?

Brs Mlas Meet Revanth

Brs Mlas Meet Revanth

మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా సీఎం రేవంత్ దావోస్ (Revanth Davos Tour) పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రావడం తో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. వీరు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నిజంగా వీరు తమ సమస్యలు చెప్పేందుకే రేవంత్ తో భేటీ అయ్యారా..లేదంటే కాంగ్రెస్ లో చేరే అంశంపై ఏమైనా మాట్లాడారా అని అంత మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎందుకంటే మంగళవారం ఉదయం తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని… పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదిమంది ఎమ్మెల్యేలు కూడా బిఆర్ఎస్ లో మిగలరన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారన్నారు. బీఆర్ఎస్‌కు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రావడం కష్టమని తేల్చి చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల ఫై అంత చర్చిస్తుండగా..ఇప్పుడు బిఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కలవడం తో కోమటిరెడ్డి వ్యాఖ్యలు నిజమే కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Tamil Nadu : విద్యార్థికి జ్యూస్లో మూత్రం కలిపి తాగించిన తోటి విద్యార్థులు