Site icon HashtagU Telugu

Fake Education Certificates : హైద‌రాబాద్‌లో ఫేక్ ఎడ్యూకేష‌న్ స‌ర్టిఫికేట్ల ముఠా అరెస్ట్‌

Crime

Crime

హైదరాబాద్: ఫేక్ ఎడ్యూకేష‌న్ స‌ర్టిఫికేట్ల కేసులో చైతన్యపురి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. జేఎన్‌టీయూ, కాకతీయ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలైన ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ల పేర్లతో నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లను పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక టెక్నికల్ రిక్రూటర్ గ్రాడ్యుయేషన్ కోసం తన వీసాను ప్రాసెస్ చేయమని చైతన్యపురిలోని ఎస్ లక్ష్మీస్ ఎస్‌ఎల్ ఓవర్సీస్ కంపెనీని సంప్ర‌దించ‌డంతో ఈ ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. అతను తన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌ను ప్రాసెసింగ్ కోసం పంపడంతో పాటు రూ. 1 లక్ష వాయిదాలో క‌ట్టాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. తదుపరి చదువుల కోసం లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలని కలలు కనే విద్యార్థులను ఈ రాకెట్ లక్ష్యంగా చేసుకుందన్నారు. పేరున్న యూనివర్సిటీల పేరుతో విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేస్తోంది. నిజానికి కొన్ని యూనివర్సిటీలు కూడా లేవన్నారు. ఒక నకిలీ సర్టిఫికేట్ అందించినందుకు ముఠా రూ. 1 లక్ష వసూలు చేస్తుందన్నారు

పోలీస్ కమీషనర్ తెలిపిన వివరాల ప్రకారం, వడ్లమూరి శ్రీనివాస్ రావు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20,000 కమీషన్‌గా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సిరిసాల లక్ష్మికి ధృవీకరణ పత్రాలను అందించారు. హైటెక్ సిటీలోని క్రిటికల్ రివర్ ఐటీ సొల్యూషన్స్‌లో ఐటీ ఉద్యోగి వడ్డే రోహిత్ కుమార్ నుంచి బోగస్ సర్టిఫికేషన్లు పొందాడు. అతను Adobe Photoshop ప్రోగ్రామ్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌ల నుండి అవసరమైన విద్యార్థుల పేర్లతో సర్టిఫికేట్‌లను డౌన్‌లోడ్ చేస్తాడు. ఒక్కో సర్టిఫికెట్ కి రూ. 30,000 తీసుకుంటాడు.

Exit mobile version