Site icon HashtagU Telugu

TRS Ex MLA: కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే!

Arigir

Arigir

టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చేరికలపై గురిపెట్టిన ఆయన వివిధ పార్టీల నాయకులు, ముఖ్యనేతలను కాంగ్రెస్ లోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే పీజేఆర్ కూతురు విజయారెడ్డి, కత్తి కర్తీక, నల్లగొండ జిల్లా నేతలు బీల్యానాయక్, ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అరిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఢిల్లీ లో రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రవీణ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కొనసాగుతోంది. సాధించుకున్న తెలంగాణను జనరంజకంగా పాలించుకోవడం కోసం నేతలు హస్తానికి జై కొడుతున్నారని టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ అన్నారు.