T Congress : ఎన్నిక‌ల వేళ టీ కాంగ్రెస్‌కి షాక్‌.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల‌

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేత‌లు బ‌య‌టికి వ‌స్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల‌కు అన్యాయం

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 02:01 PM IST

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేత‌లు బ‌య‌టికి వ‌స్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మ‌య్య అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో త‌మ‌కు అవ‌మానం జ‌రిగిందంటూ ఆవేద‌న వ్యక్తం చేసిన పొన్నాల‌..త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేకు పంపించారు. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ టికెట్ల విష‌యంలో బీసీల‌కు అత్య‌ధిక సీట్లు కేటాయించాల‌ని ఢిల్లీలో కాంగ్రెస్ హైక‌మాండ్‌ని బీసీ నేత‌లు క‌లిశారు. అయితే అక్క‌డ నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో బీసీ నేత‌లంతా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా పొన్నాల ల‌క్ష్మ‌య్య రాజీనామా చేశారు. ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో మంత్రిగా ప‌ని చేసిన పొన్నాల‌.. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి తొలి అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. 2014 ఎన్నిక‌లు పొన్నాల ల‌క్ష్మ‌య్య నేతృత్వంలోనే కాంగ్రెస్ ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఆ త‌రువాత ప‌రిణామాల‌తో పొన్నాల అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించింది.

Also Read:  Chandrababu Health : చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు కుట్ర .. నారా లోకేశ్‌ సంచలన ఆరోపణ