BJP Second List : ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ సెకండ్ లిస్టు రిలీజైంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని బీజేపీ మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవానికి మిథున్ రెడ్డి కోసం షాద్ నగర్ టికెట్‌ను సాధించేందుకు జితేందర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు.అయితే రెండుచోట్ల టికెట్ ఇవ్వడం కుదరదని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. దీంతో కుమారుడి కోసం తాను ఆశించిన అసెంబ్లీ సీటును జితేందర్ రెడ్డి వదులుకున్నారు. ఫలితంగా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం మిథున్ రెడ్డికి దక్కింది. అయితే మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలనే వ్యూహంతోనే జితేందర్ రెడ్డి.. మహబూబ్ నగర్ అసెంబ్లీ సీటును తన కుమారుడికి దక్కేలా చేసుకున్నారనే విశ్లేషణ (BJP Second List) వినిపిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక బీజేపీ మొదటి జాబితాలో 52 మంది పేర్లును ఇప్పటికే ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనుండగా.. గజ్వేల్, హుజూరాబాద్ నుంచి నుంచి ఈటల పేరు ఖరారైంది. కోరుట్ల నుంచి ఎంపీ అర్వింద్, గోషామహల్ నుంచి రాజాసింగ్, బోథ్ నియోజకవర్గం నుంచి ఎంపీ సోయం బాపూరావు పేర్లు ఖరారయ్యాయి. తాజాగా ప్రకటించిన అభ్యర్థితో మొత్తం 53 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. నవంబరు మొదటి వారంలో మరో లిస్టు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.