Site icon HashtagU Telugu

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. BJPలోకి మాజీ ఎమ్మెల్యే..?

Telangana Congress

Telangana Congress

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌ తగలనుంది. దివంగత నేత పి.జనార్థన్‌‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ (Congress) పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి BJP తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 28న PJR వర్ధంతి తర్వాత ఆయన కమలం గూటికి చేరనున్నట్లు పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగలనుంది. మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్థన్ రెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తేదీ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ నెల 28న పీజేఆర్ వర్ధంతి తర్వాత ఆయన కమలదళంలో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు అయన దూరంగా ఉంటున్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జంబో కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోకపోవడం, జంబో కమిటీలో చోటు దక్కకపోవడం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసహనంతో ఉన్న నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

Also Read: Manoj Tiwari: 51 ఏళ్ల వయసులో తండ్రైన బీజేపీ ఎంపీ..!

కాంగ్రెస్ వ్యవహారం నచ్చక మాజీ ముఖ్యమంత్రి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరో దివంగత నేత కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలహీనపడి రాజకీయ భవిష్యత్తు కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు గట్టి విధేయులుగా ఉన్నవారు ఆ పార్టీకి దూరమవుతున్నారు. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉండేది. క్రమంగా నగరంలో పార్టీ పతనమైంది. ఉన్న నేతలపై కాంగ్రెస్ కేడర్‌లో వ్యతిరేకత మైనస్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు అప్పగిస్తే పని చేసేందుకు సిద్ధమని గతంలో విష్ణు చెప్పిన విషయం తెలిసిందే.