Site icon HashtagU Telugu

Srikanth Goud : పరారీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్

Ex Minister Srinivas Goud B

Ex Minister Srinivas Goud B

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former excise minister V Srinivas Goud) తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఆయన ఫై 9 కేసులు నమోదు (Mahbubnagar police) చేసారు. అన్న ప‌ద‌విని అడ్డం పెట్టుకుని మంత్రి సోద‌రుడు శ్రీ‌కాంత్ గౌడ్ గత కొంతకాలంగా రెచ్చిపోయాడు. అక్ర‌మాల‌కు, అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడ్డాడు. అధికారం మాది..మీము ఏమైనా చేస్తాం ఆనేతిరుగా వ్యవహరించాడు. భూ క‌బ్జాల‌కు పాల్ప‌డ‌డం, అడ్డం వ‌చ్చిన వారిపై దాడుల‌కు తెగ‌బ‌డ‌టం ప‌రిపాటిగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ఇంటిపై శ్రీకాంత్ దాడికి పాల్పడినట్లు రుజువుకావడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందుతులుగా ఉన్న ఇద్దరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకోగా ఏ1 శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డిసెంబ‌ర్ 2వ తేదీన శ్రీ‌కాంత్ గౌడ్ తో పాటు స‌హ‌చ‌రులు ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై రాడ్ల‌తో దాడుల‌కు దిగారు. పిటిష‌న‌ర్ ఇంట్లోకి చొర‌బ‌డి శ్రీ‌నివాస్ గౌడ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ..నానా హడావిడి చేసారు. త‌మ‌ను చంపేస్తామ‌ని బెదిరించార‌ని, ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారంటూ పోలీసులకు సదరు బాధితులు పిర్యాదులు చేసారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న డేటా ఉన్న హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు ఇచ్చారని, దీంతో ఇక ఈ కేసులో ఫ్రధాన నిందితులుగా ఉన్న A3 మహేష్ గౌడ్, A6 రమేశ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందుతుడు శ్రీనివాస్‌గౌడ్‌ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. దాడి సమయంలో ఇంట్లో కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్‌లను బైపాస్ రోడ్డు దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also :  Surat Diamond Bourse : సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని.. టాప్-10 విశేషాలు