Site icon HashtagU Telugu

BRS : మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కి చేదు అనుభవం

Sabitha Nirasana

Sabitha Nirasana

బిఆర్ఎస్ మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) కి చేదు అనుభవం ఎదురైంది. ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. వేదిక కింద కూర్చొని నిరసన తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఫై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నుండి చేపట్టే ఏ కార్యక్రమమైనా పార్టీ పరంగా చేస్తాం.. ఓడిపోయిన వ్యక్తుల చేతనే కార్యక్రమాలను నిర్వహిస్తామని ఒక చట్టం తీసుకొస్తే తమకేమీ ఇబ్బంది లేదని అంతే కానీ గెలిచిన వ్యక్తులు అంటే గౌరవం లేకుండా రాజకీయ ఏజెండాగానే పాలన నడిపిస్తున్నారని సీఎం ఫై సబితా ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి మహిళలకు రక్షణ లేకుండాపోయిందని , రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు, దోపిడీలు పెరిగిపోయాయని..లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందని..ఇంత జరుగుతున్న ఈ ప్రభుత్వం కళ్లు మూసుకొని పాలన కొనసాగిస్తుందని ఆమె విమర్శించారు. నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని ప్రశ్నించారు.

Read Also : Zomato Delete Order Feature : జొమాటోలో డిలీట్ ఆర్డ‌ర్ ఆప్ష‌న్‌.. దీంతో ఏం లాభమో మీకు తెలుసా..?