Site icon HashtagU Telugu

Former Minister Harish Rao: సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ క‌ల‌.. రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..!

Former Minister Harish Rao

Former Minister Harish Rao

Former Minister Harish Rao: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీష్ రావు (Former Minister Harish Rao) ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు. మంత్రులు ఈ ప్రాజెక్టు కోసం క్రెడిట్ తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నెల 15న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును తనకూ ఇష్టమైన పనిగా మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చిందని అన్నారు.

సీతారామ ప్రాజెక్టును అడ్డుకోడానికి కాంగ్రెస్ కోర్టులో కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కష్టాలు అధిగమించి పట్టుదలతో పూర్తి చేసింది. ఈరోజు మీకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రాజెక్ట్ కట్టినట్టి కటింటగ్ ఇస్తున్నారు. ఇతరుల ఘతనను తమ ఘనతగా చెప్పుకునేవాళ్లను పరాన్నజీవులు అంటారు. కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వం తీరు అలాగే ఉంది. రూ. 75 కోట్లకే లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటే నోబెల్ ప్రైజుకు ఇవ్వాలి. ప్రాజక్టు కట్టాలంటే డిజైన్, భూముల సేకరణ, అనుమతులకు ఏళ్లు పడుతుంది. మీరు ఏడు నెలల్లోనే పూర్తి చేశారా? ప్రాజెక్టు దగ్గరికి రోజూ ఒక మంత్రి వెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడుతున్నారు. జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. 30 వేల ఉద్యోగాల తీరులాగే ఉన్నది సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ఆయ‌న పేర్కొన్నారు.

Also Read: UGC NET 2024: పరీక్ష రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 95 శాతం పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్, పరీక్షలు అన్నీ పూర్తి చేసి నియామకాల దగ్గరి ఆగిపోయింది. కాంగ్రెస్ నియామాకాలు చేసి తన ఘనతగా చెప్పుకుంటోంది. మేం నిర్మించిన ఫ్లైఓవర్లను, ప్రాజెక్టులను ప్రారంభిస్తూ మేం తెచ్చిన బస్సులకు జెండాలుపుతూ మేం అమలు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ కాలం గడపుతున్నారు. కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తామని అంటున్నారు. మీ తండ్లాట, మీ తాపత్రయమే నీ నైతిక పతనానికి సంకేతమ‌ని విమ‌ర్శించారు.

సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల. కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారు. రాజీవ్, ఇందిరా సాగర్‌లలో మీరు 3వేల సామర్థ్యం పెట్టగా కేసీఆర్ 9 వేల క్యూసెక్కులకు పెంచారు. వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టును మేం కట్టామంటున్నారు. ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీల్లో 5 మేం పూర్తిచేశాం. మిగతా మూడింటిలో 80 శాతం పని పూర్తయింది. మోటార్లు, పంప్ హౌసుల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో జరిగిందే. మీరు నెత్తిమీద నీళ్లు చల్లుకుని పాపపరిహారం చేసుకుంటున్నారని అన్నారు.

మీ పరిపాలన ఆగమాగమైంది. గ్రామాల్లో పారిశుధ్యం లేక జనం రోగాల బారిన పడుతున్నారు. 8 నెలల బాబు కూడా డెంగీతో చనిపోయాడు. మూడు వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. పసికందులను కుక్కలు పీక్కుతింటున్నాయి. హాస్టళ్లలో భోజనం కలుషితం అవుతోంది. వైన్ షాపులకు టార్గెట్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్ మాని సంక్షేమంపై దృష్టి పెట్టండని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

Exit mobile version