Site icon HashtagU Telugu

Ganta Meets GodFather: గాడ్ ఫాదర్ తో గంటా.. ఆసక్తి రేపుతున్న భేటీ!

1

1

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్‌లు మోహన్ రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ ఘన విజయం సాధించింది. ఈ మూవీ సక్సెస్ సందర్భంగా ఆయన చిరంజీవిని ప్రత్యేకంగా  గంటా అభినందించారు.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటే తాను రాజకీయాలకు దూరంగా ఉండి మౌనం పాటించాలనుకుంటున్నట్లు చిరంజీవి ఇటీవల ప్రకటించారు. అయితే వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గంటా అనుచరులు తేల్చి చెప్పారు. అయితే గంటా జనసేనలో చేరే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.