Site icon HashtagU Telugu

Nallala Odelu Couple: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. కారెక్కిన నల్లాల దంపతులు!

1

1

రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జూడో యాత్ర తెలంగాణకు చేరకముందే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం ప్రగతిభవన్ లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మున్సిపల్ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మే 19వ తేదీన మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన సతీమణి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. నాలుగున్నర నెలలకే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక, రోజురోజుకు పార్టీ ప్రజల్లో చులకన అవుతుండడంతో ఉద్యమ పార్టీలో తిరిగి చేరారు. ఈ చేరికతో చెన్నూరు నియోజకవర్గం లో బాల్క సుమన్ కు ఎదురులేకుండా పోయింది. తిరిగి గులాబీ గూటికి చేరడం చాలా ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఒదేలు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బిఅర్ఎస్ పార్టీని అధికారికంగా ప్రకటిస్తున్న సమయంలో ఈ చేరిక ఆ పార్టీలో జోష్ నింపింది. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Exit mobile version