Site icon HashtagU Telugu

Nalini-Revanth: సీఎం రేవంత్ ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Nalini

Nalini

Nalini-Revanth: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు ఉద్యోగం అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడ్డాను… ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మ ప్రచారానికి పనిచేస్తా.. గతంలో నేను, తోటి ఉద్యోగులు.. డిపార్ట్మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలా ఎవరూ బాధపడవద్దన్నదే నా అభిప్రాయం’’ అంటూ ఆమె రియాక్ట్ అయ్యారు.

Also Read: Gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం, ఎగబడుతున్న పసిడి ప్రియులు