Site icon HashtagU Telugu

Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల జాబితాలో సరికొత్త విషయాలు బట్టబయలు

Acb Raids On Somesh Kumar

Acb Raids On Somesh Kumar

ధరణి పోర్టల్ సృష్టికర్త, మాజీ CS సోమేశ్ కుమార్ (Somesh Kumar) ..ఆస్తుల చిట్టా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే RR(D) యాచారంలో ఎకరానికి రూ.2లక్షల చొప్పున నలుగురి వద్ద ఆయన 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తక్కువ ధరకే ఆయన భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫార్మా సిటీ అక్కడే వస్తుందని తెలుసుకుని.. క్విడ్ ప్రోకో ప్రకారం కొనుగోళ్లు జరిగినట్లు ఏసీబీ (ACB) భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

25 ఎకరాల భూములను అత్యంత తక్కువ రేటుకు తన భార్య డాగ్యన్ముద్ర పేరిట కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో.. కేవలం రూ.2 లక్షలకే కొన్నారు. అయితే.. ధరణి పోర్టల్ వచ్చాక కొనుగోలు చేశారా? లేక అంతకుముందే కొన్నారా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ధరణి పోర్టల్‌లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం.5237గా ఉంది.ధరణి పోర్టల్‌లో ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను పరిశీలిస్తే.. అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు.

సోమేశ్‌కుమార్ మాత్రం తాను ఈ భూమిని ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018లో కొన్నానని చెప్తున్నారు. తాను ప్రశాసన్ నగర్‌లో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి.. ఆరు సంవత్సరాల కిందే ఈ వ్యవసాయ భూమిని కొన్నట్లు తెలిపారు. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని, ప్రభుత్వం కూడా తనకు లేఖ ద్వారా అనుమతి ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

Read Also : Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్