ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు.
ఉన్నట్టుండి బీపీ డౌన్ కావడంతో ఆయనని కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే రోశయ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ అదిష్ఠానం ఆయన్ని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. పద్నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య ఆ కాలంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని ఒత్తిడిని తట్టుకోలేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దానికి ముందు ఆయన అనేక శాఖలకు మంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువరోజులు ఆర్థికమంత్రిగానే కొనసాగారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన రోశయ్య కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.