Site icon HashtagU Telugu

Marredpally : మాజీ సిఐ నాగేశ్వర్ రావు కేసు.. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు..!!

Ci Nageshwer Rao

Ci Nageshwer Rao

సర్వీసు నుంచి డిస్మిస్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు కోర్టులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేప్ అండ్ కిడ్నాప్ కేసు లో నాగేశ్వర్ రావ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు జైల్లో ఉన్న నాగేశ్వర్ రావును రెండు రోజుల క్రితమే సర్వీస్ తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేస్ లో అన్ని సాక్ష్యాలను కోర్టు లో సమర్పించారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలు పొందపరిచారు పోలీసులు. సీసీ ఫుటేజ్ వివరాలు,డి ఎన్ ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్ లో పోందపరిచారు పోలీసులు.