Hyderabad: షకీల్‌ కొడుకుని వదలని హిట్‌ అండ్‌ రన్‌ కేసు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు . రెండేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసును తెలంగాణ పోలీసులు రీ ఓపెన్ చేశారు. 2022 లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపైకి కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే

Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు . రెండేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసును తెలంగాణ పోలీసులు రీ ఓపెన్ చేశారు.

2022 లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు దాటుతున్న రెండేళ్ల బాలుడిపైకి కారు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షకీల్ కుమారుడు, అతని స్నేహితులతో కారులో వెళ్తున్నాడు. పార్టీ ముగించుకుని వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాలుడిని ఢీకొన్న కారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినది. మీరా ఇన్‌ఫ్రా పేరుతో రిజిస్టర్ అయిన కారుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆ కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు కూడా అప్పట్లో గుర్తించారు. అయితే ఆ స్టిక్కర్ ఉన్న కారు తనది కాదని.. తన స్టిక్కర్‌ను స్నేహితుడికి ఇచ్చాడని షకీల్ చెప్పాడు. ఈ ప్రమాదానికి సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును రీ ఓపెన్ చేశారు.

Also Read: Magadheera: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మగధీర మూవీ రీరిలీజ్