హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయిందని, ఫుడ్ డెలివరీ బాయ్ (Food Delivery Boy)పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. భయంతో సదరు ఫుడ్ డెలివరీ బాయ్ హోటల్‌లోకి పరుగులు తీయగా.. హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మరిగే నూనె మీద పడడంతో ఫుడ్ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Four Human Skulls: విమానాశ్రయంలో మనుషుల పుర్రెల కలకలం..!
ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్ మీద వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయ్యిందని దాడి చేశాడు. ఫుడ్ డెలివరీ బాయ్ మీద విచక్షణారహితంగా దాడికి దిగాడు. అంతేకాకుండా తన అనుచరులతో కలిసి హోటల్ కి వెళ్లి వారితో కలిసి అక్కడ కూడా గొడవ సృష్టించాడు. భయపడి ఫుడ్ డెలివరీ బాయ్ హోటల్ లోకి పరుగులు తీశాడు. హోటల్ లోపలే డెలివరీ బాయ్ ని పట్టుకుని చితకబాదారు. వారి విచక్షణారహిత దాడిలో హోటల్ లో మరిగే నూనె వారి మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ తో పాటు మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ గొడవ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకొని విచారణ చేపట్టారు.