Chandrababu: ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఏపీ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రజల ముందుకు వైసిపి `అక్రమాలు, అవినీతిని తీసుకురావడం, అధికారులను అప్రమత్తం చేయడం వంటి కఠినమైన పనులు చేపట్టిన చంద్రబాబు (Chandrababu), ఇప్పుడు తన దృష్టిని తెలంగాణలో పార్టీ బలోపేతంపై (Focus) పెట్టేశారు.
ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో (Tdp Senior Leaders) సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో, పార్టీకి అవసరమైన ఆడహక్ కమిటీల ఏర్పాటును, జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను, మరియు బూత్ స్థాయి (Booth Level) నుండి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ టీడీపీ (Telangana Tdp) నూతన అధ్యక్షుడి ఎంపికపై కూడా అభిప్రాయ సేకరణ జరుగనుంది.
ప్రస్తుతానికి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు (Bakkani Narsimhulu) ఉన్నారు. గతంలో ఎల్ రమణ (L Ramana) మరియు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani) పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించినప్పటికీ, వారు బీఆర్ఎస్‌లో (BRS) చేరడంతో, ఇప్పుడు నర్సింహులు తాత్కాలికంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతిమంగా, ఏపీలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో, తెలంగాణలో పార్టీ స్థితిగతులపై చర్చలు జరగడం, టీడీపీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.