Site icon HashtagU Telugu

Hyderabad Police: బండి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై పోలీసుల ఫోకస్.. దొరికితే అంతే!

Helmet Rule

Helmet Rule

హైదరాబాద్ సిటీలోని చాలామంది నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తూ ట్రాఫిక్ చలాన్స్, పోలీసుల నుంచి తప్పించేకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిపై పోలీసుల ద్రుష్టి పెట్టనున్నారు. ఇకపై నెంబర్ ప్లేట్ విషయంలో తప్పులున్నా బండిని ఆపేస్తాం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ (Hyderabad) పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.

బండి నెంబర్ (Number Plate) స్ప‌ష్టంగా లేక‌పోతే వెంటనే ఆపి చెక్ చేస్తున్నారు. తేడా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. చైన్ స్నాచర్లు, అంతర్ రాష్ట్ర నేరస్తులు.. బైక్ లపై ప్రయాణిస్తూ నెంబర్ ప్లేట్ల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా సీసీ కెమెరాలకు కూడా దొరక్కుండా వారు తప్పించుకుంటున్నారు.

నెంబర్ ప్లేట్ ని ట్యాంపర్ చేయడం.. అంకెలు, అక్షరాలు (Letters) గ‌జిబిజిగా ఉండేలా చేయ‌డం వల్ల.. బైక్ ల ఆధారంగా నేరస్తుల్ని పట్టుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా నగరంలో చైన్ స్నాచర్లు ఈ ట్రిక్ ద్వారా తప్పించుకుంటున్నారు. దీనిపై పోలీసులు (Police) దృష్టిసారించారు. ప్రస్తుతం రోజువారీ తనిఖీల్లో 300నుంచి 350 ట్యాంపరింగ్ కేసులు (Cases) నమోదవుతున్నాయని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్‌ దేవేంద్రసింగ్‌ చౌహాన్‌. ఆ కేసుల సంఖ్యను సున్నాకు తగ్గించడమే తమ లక్ష్యం అని చెప్పారు.

Exit mobile version