Hyderabad: హాస్టల్ మొదటి అంతస్తులోకి చేరిన వరద నీరు.. పొక్లెయిన్ల సహాయంతో విద్యార్థులను అలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు నగరంలోని పరలోతట్టు ప్రాంతాలు జలమయ

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 03:12 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు నగరంలోని పరలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రదేశాలలో ఒక ప్రమాదకర స్థాయిని దాటి మరి నీరు ప్రవర్తిస్తుండడంతో జనం ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని గుప్పు గుప్పు మంటూ బతుకుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి అలాగే ఉందని చెప్పవచ్చు.

ఇప్పటికే హైదరాబాదులో చాలా ప్రదేశాలలో హెచ్ఎంసి అధికారులు జారీ చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉంటున్న ప్రైవేటు హాస్టల్స్‌ మొదటి అంతస్తులోకి భారీగా వరదనీరు చేరింది. సుమారు 15 అపార్ట్‌మెంట్లలోకి వరదనీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తరలిపిస్తోంది. ఆందోళన చెందుతున్న విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు.

నీటి కాలువలు, కుంటలు కబ్జా చేసి భవనాలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు విమర్శిస్తున్నారు. అయితే హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా ఎటువంటి ప్రాణ హాని జరగలేదని తెలిపారు. ఇంకా హైదరాబాదు నగరంలో చాలా ప్రదేశాలలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అందుకు సంబంధించిన చర్యలను చేపట్టారు.