Site icon HashtagU Telugu

Flipkart: తెలంగాణ రైతులకు విస్తృత మార్కెట్.. ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం !!

Flipkart Platform Fee

Flipkart Platform Fee

దేశవ్యాప్త మార్కెట్ ను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ రైతులు, స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జీ)కు ఈకామర్స్ దిగ్గజం ” ఫ్లిప్ కార్ట్ “తోడ్పాటు అందించనుంది. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తో కలిసి పనిచేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫామ్ ను వినియోగించే దాదాపు 40 కోట్ల మందికిపైగా వినియోగదారులకు తెలంగాణ చిరు ధాన్యాలు, పప్పులు, మసాలాలను చేరేవేసేందుకు కసరత్తు జరగనుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతులు ఫ్లిప్ కార్ట్ ద్వారా స్వయం సహాయక బృందాలకు సమకూరుతాయి. పంట నాణ్యత, ధర నిర్ణయం, నిల్వ సదుపాయాలు వంటి అంశాలపై స్వయం సహాయక బృందాలకు ఫ్లిప్ కార్ట్ శిక్షణ కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ) ప్రతులను తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు మార్చుకున్నారు.

ఇక దేశవ్యాప్త మార్కెట్

“దేశంలో ఈ తరహా ఒప్పందం జరగడం ఇదే తొలిసారి. రైతుల వికాసానికి ఇది బాటలు వేస్తుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు పంట కొని ఇక దేశవ్యాప్త మార్కెట్లో విక్రయించేందుకు ఫ్లిప్ కార్ట్ వేదికగా ఉపయోగపడుతుంది”- మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు